Tuesday, April 30, 2024

ఎన్ని ఓటిటి వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం

- Advertisement -
- Advertisement -

RED movie Release to Sankranthi

 

రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. స్రవంతి మూవీస్ పతాకంపై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘కౌన్ హే అచ్చా… కౌన్ హే లుచ్చా’ పాట సహా అంతకుముందు విడుదలైన పాటలకు శ్రోతల నుండి అద్భుతమైన స్పందన లభించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక గురువారం ‘రెడ్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి ‘ఇస్మార్ట్ శంకర్’లో విశ్వరూపం చూపించి మాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు ‘రెడ్’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు. ఆశ్చర్యమేంటంటే చాలా సున్నితంగా, క్లాస్ గా కనిపించే డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా ఈ చిత్రంతో తాను మాస్ చిత్రాలు తీయగలనని నిరూపించుకున్నాడు.

ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ కథ, సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే హీరో రామ్ పోతినేని డబుల్ రోల్‌లో చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్న చిత్రమిది” అని అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ “ఈ చిత్రం చేసే అవకాశమిచ్చినందుకు స్రవంతి రవి కిశోర్, రామ్‌లకు ధన్యవాదాలు. ఈ చిత్రం అందరికీ మంచి సక్సెస్‌ని, గుర్తింపునివ్వాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ “ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళ్తాం. వంట చేసుకోగలిగినా హోటల్‌కి వెళ్తాం. అలాగే ఎన్ని ఓ.టి.టి. వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం.

ఆ అనుభూతే పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇన్ని రోజుల విరామం, వాయిదాలు, కష్టాలు అన్నీ మరచిపోయి థియేటర్లలో చిత్రం చూస్త్తే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అలాంటి అనుభూతి అందరికీ ఇవ్వాలనే చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు స్రవంతి రవి కిషోర్, కిషోర్ తిరుమల. ఇందులో ఉన్న పోలీస్ రోల్‌లో నివేదా పేతురాజ్ చాలా బాగా చేసింది. మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు తమ పాత్రలకు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, హీరోయిన్లు నివేదా పేతురాజ్, మాళవిక శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News