Wednesday, May 8, 2024

రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు

- Advertisement -
- Advertisement -

Registration of family members' name in Ration card

దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారుల ప్రయత్నాలు
నెలాఖరు వరకు అర్హులను గుర్తించి, వచ్చే నెలల్లో రేషన్ బియ్యం
స్దానికులు రాజకీయ దళారుల మాటకు మోసపోవద్దని అధికారుల సూచనలు

హైదరాబాద్ : నగరంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా, పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్పు ఆలస్యం కావడంతో కార్డు దారులు తమ పిల్లల పేరు చేర్చాలని పలుమార్లు అధికారులను కోరడంతో ఎట్టకేలకు జిల్లా పౌరసరఫరాల అధికారులు ఆన్‌లైన్‌లో 2018తరువాత నమోదు చేసుకున్న వారి జాబితా ఆధారంగా చేర్పులు, అడ్రస్సు మార్పు వంటివి త్వరలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈనెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేస్తామని,వారి పేరు మీద రేషన్ బియ్యం సెప్టెంబర్ మాసంలో తీసుకునే విధంగా చేస్తామంటున్నారు. గత ఏడేళ్లు కితం జారీ కార్డులో మృతి చెందినవారి పేర్లతో పాటు, నగరాన్ని వీడిన గ్రామాల్లోకి వెళ్లిన వారి పేరు మీద రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. వారి పేర్లు కూడా తొలగిస్తున్నట్లు, అర్హులైన కొత్తవారి పేర్లు నమోదు చేస్తామంటున్నారు. చేర్పులు, అడ్రస్సు మార్పుల కోసం 2.10లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు, వాటిలో కుటుంబ సభ్యుల చేర్చుటకు సంబంధించినవే ఎక్కువ ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఆధార్‌కార్డు వంటి వివరాలు సక్రమంగా పొందుపరితే గుర్తించనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా జిల్లాలో 56,060 కార్డులు మంజూరు చేయగా 2.25లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో కార్డులు 6.36 లక్షలకు చేరినట్లు వివరిస్తున్నారు. కొత్తకార్డులకు ఈనెల నుంచి యూనిట్‌కు 10కేజీల చొప్పన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు పేర్కొంటున్నారు. రేషన్‌కార్డుల్లో చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలను సంబంధిత అడ్రస్సుకు స్దానిక అధికారులు పరిశీలన, కార్డులో నమోదు చేస్తామని, కొంతమంది రాజకీయ దళారులు రేషన్‌కార్డుల పేరుతో బస్తీలకు చెందిన ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని, అలాంటి విషయాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News