Sunday, May 5, 2024

పునరావాస చర్యలు వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : జిల్లాలో దేవరకొండ నియోజక వర్గ పరిధిలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి భూ సేకరణ,నష్ట పరిహారం చెల్లింపు,అర్&అర్ కి ంద పునరావాస చర్యలు వే గవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిండి ఎత్తి పోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్‌ల నిర్మాణ భూ నిర్వాసితులు, ఏ.యం. అర్. పి. ప్రాజెక్ట్‌ల సంబందించి భూసేకరణ,నిర్వాసితులకు చెల్లింపు, పునరావాస చర్యలు ప్రగతిపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లు,ఇరిగేషన్,రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రాజెక్ట్ ల వారీగా సమీక్షించారు.

డిండి ఎత్తి పోతల పథకం కింద నిర్మాణం చేస్తున్న సింగ రాజు పల్లి, గొట్టి ముక్కల, డిండి మె యిన్ కెనాల్, ఏ.యం.అర్.పి కింద డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్వాసితులకు భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, పెద్ద గట్టు,కంభాల పల్లి, పోగిళ్ల,అంబా భవాని,అక్కంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల భూ సేకరణపై సమీక్షించారు.

పెండ్లి పాకల రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గుడి తండా,హర్యా తండా, కారో బార్ తండా, పత్యా తండా,డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపుకు గురయ్యే నక్కల గండి త ండా నిర్వాసిత గ్రామాలకు సంబందించి పునరావాస ప్రక్రియపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పునరావాస కాలనీలలో లే అవుట్ పూర్తి చేసి మౌలిక వసతులు పునరావాస కాలనీ లలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశ ంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News