Tuesday, April 30, 2024

జెఇఇ మెయిన్ ఫలితాలల్లో రైల్వే అధికారి కుమారుడి ఖ్యాతి

- Advertisement -
- Advertisement -

JEE Main Results

 

హైదరాబాద్: జెఇఇ మెయిన్ ఫలితాల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ముఖ్యకార్యదర్శి నీలకంఠారెడ్డి కుమారుడు చాగరి కౌశల్ కుమార్‌రెడ్డి దేశంలోనే టాపర్‌గా రికార్డు సాధించడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జిఎం.గజానన్ మాల్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో దేశ వ్యాప్తంగా జెఇఇమెయిన్ 2020 పరీక్ష 233 పట్టణాలు పరిధిలో నిర్వహించగా 8.69లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జాతీయ స్థాయిలో చాగరి కౌశల్ కుమార్ రెడ్డి కెమిస్ట్రిలో 100శాతం మార్కులతో 100శాతం ఎస్‌టిఎ సాధించారు. విద్యాభాస్యం సెయింట్ పాల్స్ హైస్కూల్ 8వ తరగతి, అనంతరం శ్రీచైతన్యలో కొనసాగించారు.

బెంగళూరు ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్స్ నుండి కెవిపివై(కిషోర్ వైజ్ఞానిక్ ప్రొత్సహన్ యోజన), ఫెలోషిప్ కూడా పొందారు. ఫిజిక్స్, కెమిస్ట్రి, అస్ట్రానమీలలో నిర్వహించిన ఐఎపిటి (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్)ఒలంపియాడ్ 2020లో ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్ పరీక్ష సెకండ్ స్టేజీకి ఎన్నికైయ్యాడు, ఈ పరీక్షను హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ముంబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కష్టపడే తత్వం విజయానికి నాందిగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌మేనేజర్ ముఖ్యకార్యదర్శి, విద్యార్ధి తండ్రి నీలకంఠారెడ్డి పేర్కొన్నారు.

Reputation of Railway officer’s son in JEE Main Results
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News