Sunday, April 28, 2024

ఖగోళంలో మిస్టరీలపై పరిశోధన

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే (ఎస్‌కేఏ)లో మన దేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నిజానికి చాలా ఏళ్లుగా దీనికి సహకారం అందిస్తున్నప్పటికీ తాజా నిర్ణయంతో పూర్తిస్థాయి సభ్య దేశంగా అవతరించనుంది. దీంతో శాస్త్రీయ ప్రయోజనాలను పెద్దఎత్తున వాడుకోవటానికి వీలవుతుంది. ఇంతకీ ఎస్‌కేఏ అంటే ఏంటి? దీని ప్రత్యేకతేంటి? తెలుసుకుందాం. స్క్వయర్ కిలోమీటర్ అరే ఒక్క టెలిస్కోప్ కాదు. ఇది వేలాది కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్న వందలాది చిన్న రేడియో యాంటెన్నాల సముదాయం. వీటి నుంచి అందే సంకేతాలను ఎస్‌కేఏ క్రోడీకరించి ఒక పెద్ద రేడియో టెలిస్కోప్ మాదిరిగా పనిచేస్తుంది.

రెండు దశల్లో నిర్మాణం : అపర్చర్ సింథసిస్ ప్రక్రియ సాయంతో అత్యంత సున్నితమైన, యాంగ్యులర్ రెజల్యూషన్ చిత్రాలను సృష్టిస్తుంది. ఇది దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో రెండు వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీల్లో పనులు నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయమైన ‘స్క్వయర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ (ఎస్‌కేఏఓ)’ బ్రిటన్‌లోని జోడ్రెల్ బ్యాంక్ అబ్జర్వేటరీలో కొలువై ఉంటుంది. ఎస్‌కేఏను రెండు దశల్లో నిర్మించనున్నారు. తొలిదశ రెండేళ్ల క్రితం మొదలైంది. మరో ఐదేళ్లలో వినియోగానికి అందుబాటులోకి రావొచ్చని ఆశిస్తున్నారు. మన నక్షత్ర మండలం దక్షిణార్ధ గోళం నుంచి బాగా కనిపిస్తుంది. అందువల్ల స్క్వయర్ కిలోమీటర్ అరేను ఈ ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార పరిశోధన ప్రాజెక్టుల్లో ఇదొకటి. దీని నిర్మాణం పూర్తయితే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ కాగలదు.

16 సభ్యదేశాలు : స్క్వయర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ 2019లో మొదలైంది. ఇందులో మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, ఇటలీ సభ్యులుగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని అరే 350 ఎంహెచ్‌జెడ్ నుంచి 15.4 జీహెచ్‌జెడ్ మధ్యలో ఉండే మాధ్యమిక ఫ్రీక్వేన్సీ సంకేతాలను స్కాన్ చేస్తుంది. ఆస్ట్రేలియాలోని టెలిస్కోప్ దిగువ ప్రీక్వేన్సీ (50-350 ఎంహెచ్‌జెడ్) శ్రేణిని పరిశీలిస్తుంది. డేటా కచ్చితత్వం కోసం మున్ముందు ఆఫ్రికా దేశాల్లోనూ అదనపు డిష్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌కేఏ ప్రాంతంలో నిర్మించే టెలిస్కోప్ సదుపాయాలను ప్రికర్సర్స్ అనీ, ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో ఉండి పరిశోధనలకు ఉపయోగపడుతున్నవాటిని పాత్‌ఫైండర్స్‌గా భావిస్తున్నారు. ఇండియా పాత్‌ఫైండర్ పరిశోధన భాగస్వామిగా పుణేలోని యాంట్ మెట్రివేవ్ రేడియో టెలిస్కోప్ పనిచేస్తోంది. దీన్ని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ నిర్వహిస్తోంది. ఎస్‌కేఏ ఇండియా కన్సార్టియంలో దేశవ్యాప్తంగా 20కి పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో బిట్స్ పిలానీ హైదరాబాద్ కూడా పాలు పంచుకుంటోంది.

నక్షత్ర మండల పటాలు : ఎస్‌కేఏ సుదూర అంతరిక్షాన్ని వేగంగా వీక్షించటానికి వీలు కల్పిస్తుంది. పాలపుంతను మరింత స్పష్టంగా చూపిస్తుంది. విశ్వం అంచుల వరకూ కనిపించే నక్షత్ర మండలాలను స్పష్టమైన పటాలుగా రూపొందించటానికీ ఎస్‌కేఏ ఉపయోగపడుతుంది. ఇది వి శ్వం ‘చీకటి యుగాల’ మీద అధ్యయనానికీ తోడ్పడుతుంది. విశ్వం ఆవిర్భావానికి మూలమైన బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలి 3.8 లక్షల సంవత్సరాల వరకూ కాంతి ప్రకాశించటానికి వీల్లేనంత వేడి నిండి ఉండేది. అణువులు అతి బలంగా ఢీకొనటంతో అవి పారదర్శక ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోయి పొగ మంచులాంటి కాంతిని వెదజల్లాయి. ఆ సమయంలో ఏం జరిగిందనేది పెద్దగా తెలియదు. దీన్ని అవగతం చేసుకోవటానికి స్క్వయర్ కిలోమీటర్ అరే ఉపయోగపడగలదు. అంటే ఇది అందించే సమాచారంతో నక్షత్ర మండలాల ఆవిర్భావ రోజులనూ దర్శించే అవకాశముందన్నమాట.

విశ్వంలో కృష్ణ పదార్థం, కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) పాత్రను అర్థం చేసుకోవటాకీ ఇది తోడ్పడుతుంది. అలాగే క్రాడిల్ ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా భూమికి ఆవల జీవాన్వేషణలోనూ సాయం చేయగలదు. నివాసయోగ్య ప్రాంతాల్లో నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను గుర్తించి, అక్కడి వాతావరణంలో కర్బన రసాయన మిశ్రమాలను అధ్యయనం చేస్తుంది.
ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం : 21వ శతాబ్దంలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకదాని నిర్మాణం ప్రారంభమైంది. ది స్క్వేర్ కిలోమీటర్ ఆర్రే పేరిట అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలుపెట్టారు. దీనిని 2028 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం యూకే లో ఉంటుంది. ఖగోళంలో చాలా మిస్టరీలపై పరిశోధనలకు దీనిని వినియోగించనున్నారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలపై కూడా పరిశోధనలు చేయనుంది.

భూగోళం వంటి గ్రహాలు మరేమైనా ఉన్నాయేమో అన్న అంశంపై కూడా శోధించనుంది. నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో నిర్మాణ పనులు ప్రారం భం కానున్నాయి. ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ప్రాంతంలో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రిస్మస్ చెట్లు వంటి దా దాపు 1,00,000 పైగా యాంటెన్నాలను నిర్మించనున్నారు. ఎస్‌కేఏ లాసైట్ ప్రాజెక్టు నిర్మాణ డైరెక్టర్ ఆంటోనీ షింకెల్ మాట్లాడుతూ తొలిసారి ఇటువంటి టెలిస్కోప్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా రేడియో, ఆప్టికల్ టెలిస్కోప్‌లు ఉన్నా దీంతో వాటిని పోల్చలేమని ఆయన పేర్కొన్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన ఆలోచన 1990ల్లో వచ్చింది. 2003లో ఈ ప్రాజెక్టుపై పనిచేయడం మొదలుపెట్టామన్నారు. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వనిర్మాణం తొలినాళ్లలోకి చూడటానికి భారీ టెలిస్కోప్ అవసరమన్నా రు. ఈ టెలిస్కోప్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది నుంచి చురు గ్గా జరుగుతాయని భావిస్తున్నారు. 2028 నాటికి ఈ పను లు పూర్తవుతాయని అంచనావేశారు. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో 197 భారీ డిష్‌లను ఏర్పాటు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News