Saturday, May 4, 2024

పెరుగుతున్న అద్దెలు

- Advertisement -
- Advertisement -
Rising house rents in Hyderabad
హైదరాబాద్‌లో 2014 నుంచి ఏటా 3 నుంచి 6 శాతం పెరుగుతున్న ఇళ్ల కిరాయిలు
ఈ సంవత్సరం 3% నుంచి 7% పెరిగే అవకాశం

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగింది. ఇళ్లకు డిమాండ్ ఎక్కువయ్యింది. అద్దెలు పెరిగిపోయాయి. 2014 నుంచి 2020 వరకు హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 26 శాతం పెరగ్గా ఇండియాలోని 7 ప్రధాన మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడే అద్దెలు ఎక్కువ పెరిగాయని ఓ సర్వేలో తేలింది. హైదరాబాద్ లాగే ఐటి హబ్‌గా మారుతున్న గుర్గావ్‌లో గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో సైతం నెల వారీ అద్దెలు 17 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు పెరిగాయని దానివల్లే అద్దెలు పెరిగాయని ఆ సర్వేలో తేలింది. ‘ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఆఫీసులను అద్దెకు తీసుకునే కంపెనీల సంఖ్య పెరుగుతోంది. వాణిజ్య సముదాయాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో పలు చోట్ల ఇళ్లను ఆఫీసులుగా మార్చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ అద్దెలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం ఇళ్ల అద్దెలు 3 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఆఫీసులను లీజుకు తీసుకుంటున్నంత కాలం ఇళ్ల అద్దెలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు రియల్ వ్యాపారులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరా ల్లో 2014 నుంచి అద్దెలు ఏటా 3 నుంచి 6 శాతం పెరుగుతున్నట్టు రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వచ్చినప్పుడు అన్ని రంగాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయినా ఆ తర్వాత త్వరగా కోలుకుంది. ఇప్పుడు లగ్జరీ అపార్ట్‌మెంట్లను లీజుకు కోరే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. కొన్ని ఏరియాల్లో నెల వారీ అద్దెలను ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. కరోనా వైరస్ వచ్చాక చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటి హబ్ అయిన హైదరాబాద్ హైటెక్ సిటీలో ఈ కల్చర్ బాగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి చాలా మంది ఇళ్లనే ఆఫీసు డెస్కులుగా మార్చుకున్నారు. ఇందుకోసం ఉన్న ఇల్లు సరిపోక పోవడంతో చాలామంది పెద్ద ఇళ్లను కొనుక్కోవడం లేదా లగ్జరీ హౌస్‌లలోకి మారతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News