Tuesday, July 16, 2024

జైపూర్-అజ్మీర్ హైవేపై ప్రమాదం : 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ జైపూర్- అజ్మీర్ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకోచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు. ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ట్రక్కు అతివేగం వల్ల దాని టైరు పేలి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News