Tuesday, September 10, 2024

రోహిత్‌కు రెండో ర్యాంక్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇప్పటి వరకు మూడో ర్యాంక్‌లో కొనసాగిన రోహిత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. శుబ్‌మన్ గిల్ ఒక ర్యాంక్ కోల్పోయి మూడో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

రోహిత్ 765 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఐర్లాండ్ స్టార్ హారి టెక్టర్ ఐదో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) ఆరో, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) ఏదో, పాథుమ్ నిసాంకా (శ్రీలంక) 8వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. డేవిడ్ మలన్ (ఇంగ్లండ్) తొమ్మిదో, వండర్ డుసెన్ (సౌతాఫ్రికా) పదో ర్యాంక్‌లో నిలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News