Tuesday, May 7, 2024

మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Rs 4000 crore allocated for herbal cultivation

 

హైదరాబాద్: పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకోస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గిందని, మిగులు పాలన సహకార డెయిరీల ద్వారా సేకరించామన్నారు. రెండు కోట్ల మంది పాడి రైతులకు ఐదు వేల కోట్ల రూపాయలు మేర ప్రోత్సాహం ఏర్పాటు చేస్తామన్నారు. సహకార రంగంలోని డెయిరీలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని, గడువు తీరిన 242 ఆక్వా హేచరీస్‌లకు రిజిస్ట్రేషన్ గడువు మూడు నెలలు పొడిగిస్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్యాకేజ్ వివరాలు ప్రకటిస్తామన్నారు. మత్స, డెయిరీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 11 అంశాల్లో రాయితీలు కల్పిస్తామన్నారు. పిఎం ఫసల్ బీమా పథకం కింద రూ.6400 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ కింద 74300 కోట్ల మేర పంటల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. స్థానికంగా ఉన్న ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉందని, తెలంగాణ పసుపుకు, ఎపి మిర్చికి అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

వ్యవసాయ రంగ మౌళిక సదుపాయల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు పది వేల కోట్లు కేటాయిస్తామని, దేశ వ్యాప్తంగా రెండు లక్షల వరకు ఉన్న సూక్ష్మ, చిన్న సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వ్యక్తిగత బోట్లు, మత్స్య కారులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, షిపింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజ్‌లు, మార్కెట్ల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని, తేనె, పట్టు పరిశ్రమల కోసం రూ.500 కోట్లు, ఔషధ మొక్కల పెంపకానికి రూ. 4000 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.

గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు రూ.500 కోట్లు, కూరగాయలు, పండ్లు ఉల్లిపాయల సరఫరాకు ఆపరేషన్ గ్రీన్ ఏర్పాటు చేస్తామని, ఆపరేషన్ గ్రీన్ పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా రాయితీలు ఇస్తామని ప్రకటించారు. ఆరు నెలల పాటు రవాణాలో 50 శాతం రాయితీలు ఇస్తామని, కోల్డ్ స్టోరేజీల్లో ఆరు నెలల పాటు నిల్వ ఉంచుకున్న రవాణాలో రాయితీలు ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News