Wednesday, May 1, 2024

రష్యా వ్యాక్సిన్ మా లెక్కలో లేదు: డబ్లూహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

ముందు వరుసలో 9 వ్యాక్సిన్లు
రష్యాది మా లెక్కలో లేదు: డబ్లూహెచ్‌ఒ

Russia vaccine not in advanced test stages: WHO

లండన్: ముందు వరుసలో ఉన్నట్టుగా తాము పరిగణనలోకి తీసుకున్న 9 వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్ లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి డబ్లూహెచ్‌ఒ నిధులు సమకూరుస్తోంది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పనితీరును అంచనా వేయడానికి అదనపు సమాచారాన్ని తాము కోరామని డబ్లూహెచ్‌ఒ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్‌అయిల్వార్డ్ తెలిపారు. తగిన సమాచారం లేకుండా తాము తీర్పు చెప్పలేమని ఆయన అన్నారు. కరోనా కట్టడికి తాము వ్యాక్సిన్ రూపొందించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అందుకు తగిన ఆధారాలను బహిర్గతం చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Russia vaccine not in advanced test stages: WHO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News