Tuesday, April 30, 2024

పొరపాటున స్వంత నగరంపైనే బాంబులు వేసిన రష్యా యుద్ధ విమానం!

- Advertisement -
- Advertisement -

బెల్గోరోడ్: రష్యాకు చెందిన సుఖోయ్–34 ఫైటర్‌జెట్ ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిమీ.(25 మైళ్ల) దూరంలో ఉన్న రష్యా నగరం బెల్గోరోడ్‌పై ప్రమాదవశాత్తు బాంబు దాడి చేసింది. బాంబు 20 మీ. (60 అడుగుల) బిలం చేసింది. అంతేకాక దాంతో పెద్ద పేలుడు సంభవించింది. అది సమీపంలో ఉన్న దుకాణం కప్పు పైకి కారును పేల్చేసింది. దెబ్బతిన్న తొమ్మిది అంతస్తుల ఫ్లాట్‌ను ముందు జాగ్రత్త చర్యగా ఖాళీచేయమని అధికారులు ఆదేశించినట్లు ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని, అనేక భవనాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన సంక్షిప్త ప్రకటనలో ఎస్‌యు34 ఫైటర్ బాంబర్లలో ఒకటి గురువారం స్థానిక సమయం 22.15(19.15 గ్రీన్‌విచ్ కాలమానం) పేల్చిందని పేర్కొంది. ఆ జెట్ పొరపాటున ఆయుధాన్ని పేల్చిందని అధికారులు తెలిపారు. అయితే పొరపాటున జరిగిన ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని తెలిసింది.

Car blasted

Belgorod Mayor Valentin Dem visits

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News