Thursday, May 2, 2024

‘సోలో బ్రతుకే సో బెటర్’ టీజర్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

 

‘ప్రతిరోజు పండగే’ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. యుత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొత్త దర్శకడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.  తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వాలైంటైన్స్ వీకెండ్ మనమంతా కలిసి జరుపుకుందాం.. మన స్లోగన్ ఒక్కటే, సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్నాడు సాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం టీజర్ ను, మే 1న సినిమాను విడుదల చేయనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి తేజ్ కు జోడీగా ఇస్మార్ట్ పోరీ నభా నటేషా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Sai Dharam Tej’s SBSB Movie First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News