Sunday, April 28, 2024

పాత్ర నచ్చితేనే…

- Advertisement -
- Advertisement -

Sai pallavi says about her Movie roles

 

హీరోయిన్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టునేవాళ్లు మొదటి టైపు. ఏ ఇండస్ట్రీలోనైనా వీళ్లే మెజారిటీగా ఉంటారు. వాళ్లు ఎలాంటి సినిమా ఛాన్స్ వచ్చినా పచ్చజెండా ఊపేస్తారు. ఇక రెండో టైపు వాళ్లు ప్లాన్డ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటారు. రెమ్యునరేషన్ అనేది వారికి రెండవ ప్రాధాన్యతగా ఉంటుంది. వీళ్లకు క్యారెక్టర్ ముఖ్యం. సినిమాలో తమ పాత్ర నచ్చితేనే ఓకే చెబుతారు. అలాంటి వారిలో ఒకరు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. ఆమె తన పాత్ర నచ్చక పలు సినిమాలను వద్దనుకుంది.

విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’లో మొదట సాయి పల్లవినే అనుకున్నారట. కానీ క్యారెక్టర్ నచ్చక ఈ సినిమా చేయలేదు కేరళ కుట్టి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ ఛాయిస్ కూడా ఈ అమ్మడేనట. పాత్ర నచ్చకపోవడంతో తాను ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. ఇవేకాదు.. ఇంకా ఉన్నాయి. పవన్, – రానా చిత్రంలోనూ సాయి పల్లవినే అనుకున్నారు. అలాగే బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘కాదన్’ రీమేక్‌లోనూ ఈ బ్యూటీనే తీసుకుందామని అనుకున్నారు. కానీ పాత్ర నచ్చకపోవడంతోనే ఈ సినిమాలను ఆమె వద్దనుకుందని టాక్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News