Friday, April 26, 2024

భారీ యాక్షన్ సీక్వెన్స్

- Advertisement -
- Advertisement -

Salaar movie Shooting in Godavarikhani

 

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని గోదావరిఖనిలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు పలువురు ఫైటర్స్ పాల్గొంటున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఇక గోదావరిఖనిలో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట. త్వరలోనే ప్రభాస్, శృతిహాసన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News