Thursday, May 2, 2024

పాము కాటుకు గురైన సల్మాన్‌ఖాన్

- Advertisement -
- Advertisement -
Salman Khan gets bitten by snake
విషపు పాము కాదన్న సన్నిహితులు

ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు. సల్మాన్ నివాసముంటున్న ఫార్మ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఆయన చేతిని పాము కరిచిందని సన్నిహితులు తెలిపారు. అయితే, అది విషపు పాము కాకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు వెల్లడించారు. ఇటీవల సల్మాన్ రాయిగడ్ జిల్లా సమీపంలోని పాన్వెల్‌లోని ఫార్మ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పాము కాటుకు గురైన వెంటనే ఆయణ్ని నవీముంబయిలోని ఆస్పత్రిలో చేర్చామని సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ముంబయిలోని నివాసానికి వెళ్లారని వారు తెలిపారు. సోమవారానికి సల్మాన్‌కు 56 ఏళ్లు పూర్తయి, 57వ ఏట అడుగుపెడ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News