Monday, May 13, 2024

రాష్ట్రంలో 44కు చేరిన ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -
Omicron cases reached 44 in Telangana
కొత్తగా మరో మూడు కేసులు నమోదు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కి చేరింది. గడిచిన 24 గంటల్లో 20,576 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,662కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,022కి చేరింది. తాజాగా 190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 248 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. మరో 16 మంది ఫలితాలు రావాల్సి ఉంది. శనివారం మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 10మంది బాధితులు కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి ఆదివారం 248 మంది రాష్ట్రానికి రాగా, ఇప్పటి వరకు 11,493 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News