Sunday, April 28, 2024

అదే నన్ను వైవిధ్యం వైపు నడిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

same is driving me towards diversity Says rashmika

“నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయేలా చేయడాన్ని ఇష్టపడతాను. నేను నిజంగా ఇలా చేస్తున్నానా? అనిపించాలి. మిమ్మల్ని మీరు ఆశ్చర్యపర్చినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు రష్మిక మందన. “అభిమానులు నన్ను వేర్వేరు పాత్రలలో చూడాలి. అది అంత సులభం కాదు.. కానీ నేను ప్రయత్నిస్తున్నాను” అని తెలిపారు. గీతా గోవిందం, – డియర్ కామ్రేడ్, -మిషన్ మజ్ను,- గుడ్ బాయ్, ఆడాళ్లు మీకు జోహారు, పుష్ప.. ఇలా ఎంచుకున్నవన్నీ దేనికదే ప్రత్యేకం. విభిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను”అని రష్మిక వెల్లడించారు.

తెలుగు పరిశ్రమలో వరుస బ్లాక్ బస్టర్ లతో కేవలం అగ్ర హీరోల సరసన మాత్రమే నటిస్తున్న రష్మిక మందన్న అనూహ్యంగా బాలీవుడ్‌లో అడుగు పెట్టేయడం అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. తొలి హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ చిత్రీకరణలో ఉండగానే.. రష్మిక తన రెండవ హిందీ చిత్రం ‘గుడ్ బై’కు సంతకం చేశారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి కీలక పాత్రలో నటించేస్తున్నారు. బిగ్ బితో ఇంత తొందరగా అవకాశం వస్తుందని తాను ఊహించలేదని… ఆయనతో పిన్న వయసులో నటించే అవకాశం తనకు దక్కిందని రష్మిక ఉబ్బితబ్బిబ్బయ్యారు. తాను ప్రతిసారీ కొత్తగా ప్రయత్నించినపుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుందని… అదే తనను వైవిధ్యం వైపు నడిపిస్తుందని రష్మిక చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News