Sunday, April 28, 2024

ప్రభుత్వ కట్టడాల మాటున ఇసుక మాఫియా దందా

- Advertisement -
- Advertisement -

గోవిందరావుపేట: ప్రభుత్వ పనుల పేరుతో పరిమిట్లను అడ్డు పెట్టుకొని ఇసుక దందాపై వివరణ కోరితే స్థానిక మండలంలోని తహసీల్దారు ఇచ్చిన సమాధానం ఇది. మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కట్టడాల అవసరం నిమిత్తం ఇసుక తోలడానికి స్థానిక తహసీల్దారు అనుమతితో తీసుకున్న పర్మిట్లను అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా యథేచ్ఛగా ఇసుక అమ్ముకుంటూ ఇష్టారాజ్యంగా అమ్మకాలను కొనసాగిస్తున్నారు. మండలంలో ఏ గ్రామాల్లో ప్రభుత్వ పనులు నడుస్తున్నాయో ఆ పనులను ఎన్నెన్ని ట్రిప్పులు పర్మీషన్ ఇస్తున్నారని తెలుసుకుందామని చేసిన ప్రయత్నానికి దాటవేతగా చేస్తూ దురుసుగా సమాధానం ఇచ్చారు. ఇదే అదనుగా ఇసుక మాఫియా పర్మీషన్ అడ్డుపెట్టుకొని రెట్టింపు ట్రిప్పులను దర్జాగా తోలుకుంటూ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఇసుక దందా చేసుకుంటున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటి నిర్మాణం కోసం ఇసుక దళారులను కోరగా అధిక ధరలకు అమ్ముకుంటూ కాసులు పోగేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు సైతం ఇసుక మాఫియాతో కుమ్మకై ఈ తతంగం జరుపుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాను అరికట్టి విచారణ జరిపించి ఈ ఇసుక మాఫియాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News