Sunday, May 5, 2024

సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్ రావు మోసం చేశారు. దీంతో శ్రీదర్ రావుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. భవనం అమ్మకాల విషయంలో భారీగా నగదు వసూలు చేసి కొనుగోలుదారులను మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పోలీస్ స్టేషన్లలో శ్రీధర్ రావుపై ఏడుగురు ఫిర్యాదు చేశారు. నానక్ రాంగూడ సర్వే నంబర్ 104/3లో ఐదు ఎకరాలు అమ్మిన విషయంలో కమీషన్ ఇవ్వలేదంటూ మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాయదుర్గం పాన్ మక్తా సర్వే నంబర్ 83 పార్ట్‌లో కమర్షియల్ బిల్డింగ్‌లో ఐటి కంపెనీ స్పేస్ కోసం 11 కోట్ల రూపాయలు చెల్లించగా శ్రీధర్ రావు ఇప్పటి వరకు తమకు బిల్డింగ్ అప్పగించలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో ఆర్గానిక్ స్టోర్ యాజమాని ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్, బెంగళూరులో సెల్లార్ వర్క్ చేస్తే డబ్బులివ్వలేదని మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News