Home జాతీయ వార్తలు ‘మహా’ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నీచరాజకీయాలు

‘మహా’ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నీచరాజకీయాలు

Sanjay Raut Respond on Sachin Vaze letter
శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణ

ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ గురువారం ఆరోపించారు. అటువంటి కుటిల యత్నాలు ఫలించబోవని ఆయన స్పష్టం చేశారు. ముంబయి పోలీసు కమిషనర్‌గా కొనసాగాలంటే రూ. 2 కోట్లు చెల్లించాలంటూ మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనను డిమాండు చేశారని, అంతేగాక కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని మరో మంత్రి అనీల్ పరాబ్ తనను ఆదేశించారని ఆరోపిస్తూ సస్పెన్షన్‌లో ఉన్న పోలీసు అధికారి సచిన్ వాజే రాసిన లేఖపై సంజయ్ రౌత్ గురువారం స్పందించారు.
జైలులో ఉన్న ఖైదీలు రాసిన లేఖలను బయటపెట్టడమన్న కొత్త పోకడలు ఇప్పుడే చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను, ఐటి శాఖను అడ్డం పెట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. కాగా, తనపై ముంబయి మాజీ సిపి సచిన్ వాజే చేసిన ఆరోపణలను శివసేన నాయకుడు, మంత్రి అనీల్ పరాబ్ బుధవారం ఖండించారు. ఈ ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన సవాలు చేశారు. ఇ