Sunday, May 5, 2024

సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’

- Advertisement -
- Advertisement -

'Sarkaru Vaari Paata' release to Sankranthi

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, – జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్‌కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇటీవలే దుబాయ్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇక టాలీవుడ్‌లో వరుస పెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు కూడా తన 27వ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ని విడుదల చేసారు. ఇందులో మహేష్ చేతిలో తాళాలు పట్టుకుని నిలబడి ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News