Monday, May 13, 2024

ఆకట్టుకుంటున్న సత్వదేవ్, నిత్యా మీనన్ ‘స్కైలాబ్’ ఫ‌స్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

Satyadev's 'Skylab' first look poster released

హైదరాబాద్: విభిన్న పాత్ర‌లతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో స‌త్య‌దేవ్‌ మరో విభిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ‘స్కైలాబ్’ అనే సినిమాలో సత్యదేవ్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్ తోపాటు హీరోయిన్ నిత్యా మీన‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఇందులో సత్వదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణలు అంతరిక్షంలోని ఓ ఉపగ్రహంపై కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ సినిమాపై ఆస‌క్తిని పెంచేసింది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కెఎఫ్‌సి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను మూవీ యూనిట్ త్వరలో వెల్లడించనుంది.

Satyadev’s ‘Skylab’ first look poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News