Tuesday, May 21, 2024

మొబైల్ ఫండ్ ట్రాన్స్ ఫర్ పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీచేసిన ఎస్ బిఐ

- Advertisement -
- Advertisement -

 

SBI

ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించే కీలక నిర్ణయం తీసుకుంది. మనీ ట్రాన్స్‌ఫర్‌పై వసూలు చేసే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉచితంగా పొందడంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఎస్‌ఎస్‌డి సేవల్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.

*99# కి డయల్ చేసి బ్యాంకింగ్ సేవల్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చని ట్వీట్ చేసింది. ఇంతేకాకుండా మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లపై ఎస్‌ఎమ్‌ఎస్ ఛార్జీలు రద్దు చేయబడ్డాయి. వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చని ఎస్‌బిఐ పేర్కొంది. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్‌ఎస్‌డి) ద్వారా మొబైల్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, బ్యాంక్ స్ట్టేట్‌మెంట్ పొందడం వంటివి పొందవచ్చు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు *99# కోడ్‌ను ఉపయోగించి ఈ సేవలు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News