Wednesday, February 1, 2023

మానవ ప్రగతికి మూలం సైన్స్

- Advertisement -

 

చందుర్తి: జన విజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు – 2022లో భాగంగా పాఠశాల స్థాయిలో స్థాయి చెకుముకి టాలెంట్ టెస్టును నిర్వహించారు. ఈ సందర్భంగా చందుర్తి మండలంలోని చందుర్తి ఉన్నత పాఠశాలల జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సందర్శించి ప్రశ్నపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ బురక గోపాల్ మాట్లాడుతూ… సమాజంలో శాస్త్ర ప్రచారం, శాస్త్ర ధృకథం పెంపొందించడం బాధ్యతగా స్వీకరించి ఎంతో కృషి చేస్తున్న ఏకైక సంస్థ జనవిజ్ఞాన వేదిక బాల్యదశ నుంచే విద్యార్థుల్లో మూఢ నమ్మకాలను తొలగించి సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్టులు విద్యార్థి దశలో ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్యారం లక్ష్మినారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు మల్లయ్య, వేణు, భానురేఖ, రజిత, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కె కల్పన, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles