Tuesday, April 30, 2024

డెల్టా వేరియంట్ జోరుపై శాస్త్రవేత్తల అధ్యయనం

- Advertisement -
- Advertisement -

Scientists study Delta variant intensity

 

న్యూఢిల్లీ : కరోనా డెల్టా వేరియంట్ జోరుకు గల కారణాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. యాంటీబాడీలను ఏమార్చే సామర్ధ్యంతోపాటు అధిక సాంక్రమిక శక్తి కారణంగా ఈ వేరియంట్ ఉధృతి పెరిగినట్టు శాస్త్రవేత్తల బ్వృ తేల్చింది. ల్యాబ్‌లో ప్రయోగాలు నిర్వహించడంతోపాటు టీకా పొందాక కూడా ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారి తీరుతెన్నులను పరిశీలించింది. ఇందుకోసం గతంలో కరోనా బారినపడడం లేదా ఆస్ట్రాజెనెకా , ఫైజర్ టీకాలను పొందిన వ్యక్తుల నుంచి సేకరించిన సీరం ను పరిశోధకులు పరిశీలించారు. ఇందులో యాంటీబాడీలు ఉంటాయి. డెల్టా వేరియంట్‌పై మునుపటి ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగిన యాంటీబాడీలు 5,7 రెట్లు తక్కువగా, టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా సున్నితత్వాన్ని చూపాయని శాస్త్రవేత్తలు వివరించారు.

వ్యక్తుల్లో ప్రస్తుతం ఉన్న రోగ నిరోధక రక్షణను ఏమార్చడంలో డెల్టా వేరియంట్ సమర్ధతను చాటుతున్నట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న పార్థా రక్షిత్ చెప్పారు. శరీరంలోకి ప్రవేశించాక ఈ రకం వైరస్ చాలా వేగంగా తన ప్రతులను పెంచుకుంటున్నట్టు కూడా తేల్చారు. ఇతర వేరియంట్ల కన్నా ఇది వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. భారత్‌లో కొవిడ్ రెండో ఉధ్దృతికి ఈ అంశాలు కారణమై ఉండొచ్చు.. ఆ సమయంలో వెలుగు చూసిన వాటిలో సగం కేసులు … అంతకు ముందు ఇతర వేరియంట్లతో ఇన్‌ఫెక్ట్ అయినవారే అని బ్రిటన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన రవీంద్రగుప్తా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News