Saturday, May 4, 2024

బడుల్లో కనిపించని భౌతికదూరం…

- Advertisement -
- Advertisement -

గుంపులుగా ఒకేదగ్గర చేరుతున్న విద్యార్థులు
ముందు మూడు రోజులే కోవిడ్ నిబంధనలు
తరువాత ఫీజుల వేటలో యాజమాన్యాలు
వైరస్‌పై భయాందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
విద్యాశాఖ స్కూళ్లను తనిఖీ చేయాలని సూచనలు

Schools rusume from July 1 in Telangana

మన తెలంగాణ,సిటీబ్యూరో : నగరంలో విద్యా సంస్దలు ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభించిన మొదటి మూడు రోజుల పాటు విద్యార్థులు బడిబాట పట్టేందుకు భయపడ్డారు. వైరస్ ప్రభావం ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళ న వ్యక్తం చేస్తూ కోవిడ్ నిబంధనలు పూర్తి స్దాయిలో పాటిస్తే చిన్నారులను స్కూల్‌కు పంపుతామని పాఠశాలల నిర్వహకులకు చెప్పారు. దీంతో వారు అన్ని భద్రతలు పాటించి విద్యార్దులకు బోధన చేస్తామని హామీ ఇచ్చారు. మరుసటి రోజు కొంతమంది విద్యార్థులు ప్రత్యక్ష పాఠాలకు హాజరైయ్యారు. రెండు రోజుల పాటు పాఠశాల ప్రధానం ద్వారం శానిటైజర్, థర్మల్ మీటర్‌ను అందుబాటులో ఉంచి విద్యార్దుల ఆరోగ్య సమస్యలు తనిఖీలు చేసి, జలుబు, జ్వరం ఉంటే ఇంటికి పంపించారు. ప్రస్తుతం రోజు రోజుకు విద్యార్దుల సంఖ్య పెరగడంతో కోవిడ్ నిబంధనలు పాటించడంలేదని విద్యార్దులు పేర్కొంటున్నారు. ఒక బెంచీల్లో ముగ్గురి కంటే ఎక్కువ విద్యార్దులను కూర్చోబెట్టి, బౌతికదూరం ఉండేలా చూడటంలేదని చెబుతున్నారు.

కొందరు విద్యార్ధులు మాస్కులు సక్రమంగా ధరించకుంటే పెట్టుకోవాలని కూడా సూచనలు చేయడం లేదని, ప్రతి విద్యార్దిని గత ఏడాదికి సంబంధించిన ఫీజు, ఈవిద్యాసంవత్సరానికి చెందిన ఫీజులు చెల్లించారని అడుగుతూ వేధింపులు చేయడం తప్ప వైరస్ పట్ల నిర్లక్షం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం బోజనం కూడా ఒకే దగ్గర గుంపులుగా ఉండి చేయాల్సి వస్తుందని, అందులో జలుబు, దగ్గు లక్షణాలున్నవారినికూడా గుర్తించడంలేదంటున్నారు. సాయంత్రం స్కూళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మెట్లపై ఒకేసారి గుంపులు వస్తున్నట్లు, క్యూ పద్దతిలో వచ్చే విధంగా చూడటం లేదని చెబుతున్నారు. రెండు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో అందరిని చూసుకోవడం భారంగా మారడంలో కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఫీజులు పూర్తిగా చెల్లించడంతో చిన్నారులను ఇంటి వద్ద ఉంచలేమని, మళ్లీ వైరస్ విరుచుకపడుతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 689 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలుండగా వాటిలో 1.10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈస్కూళ్లలో 60శాతం మంది విద్యార్దులు తరగతులకు హాజరైతున్నారు. ప్రైవేటు స్కూళ్లు 1875 ఉండగా వాటిలో 7.39లక్షల మంది విద్యార్దులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రైవేటు ప్రైమరీ స్కూళ్లు తెరవలేదు. ప్రారంభమైన స్కూళ్లలో ప్రస్తుతం 70శాతం విద్యార్దులు వస్తుండగా, పాఠశాల నిర్వహకులు కోవిడ్ జాగ్రత్తలు పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవడం తప్ప విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలనే దృష్టి లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇప్పటికే విద్యాలో వెనకబడితే కనీసం స్కూళ్ల ప్రారంభమైతే ప్రత్యక్ష పాఠాలు విని గాడిలో పడుతారనే భావిస్తే ఉపాధ్యాయులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News