Monday, April 29, 2024

ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య రాజీనామా

- Advertisement -
- Advertisement -

Uttarakhand Governor Baby Rani Maurya resigns

 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం ముగియక ముందే ఆమె రాజీనామా చేయడంతో రాజకీయాలలో ఆమెకు క్రియాశీల పాత్ర లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించినట్లు రాజ్‌భవన్ అధికారి ఒకరు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5న రాణి మౌర్య కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైన అనంతరం జరిగిన ఈ పరిణామంతో ఆమె మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి వెళతారని ఇక్కడి మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి. 65 సంవత్సరాల మౌర్య 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కృష్ణకాంత్ పాటిల్ ఐదేళ్ల పాటు గవర్నర్‌గా కొనసాగారు. గత నెలతో మౌర్య గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయింది. 1995 నుంచి 2000 వరకు ఆగ్రాకు తొలి మహిళా మేయర్‌గా పనిచేసిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. 2002-2005 మధ్య ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News