Wednesday, May 1, 2024

జి20 సదస్సుకు సమన్వయకర్తగా పియూష్ గోయల్

- Advertisement -
- Advertisement -

Piyush Goyal is coordinator of G20 summit

 

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి 2023లో నిర్వహించనున్న జి20 నాయకుల సదస్సుకు షెర్పా(సమన్వయకర్త)గా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ నియమితులయ్యారు. జి20 ప్రెసిడెన్సీ 2022 డిసెంబర్ 1న భారత్ నిర్వహిస్తుందని, 2023లో జి20 నాయకుల శిఖరాగ్ర సదస్సును భారత్ తొలిసారి జరుపుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. భారత్‌కు జి20 షెర్పాగా సురేష్ ప్రభు స్థానంలో పియూష్ గోయల్ నియమితులయ్యారు. 2014 నుంచి జి20 సదస్సులకు భారతదేశ ప్రతినిధి బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. జి20 సభ్య దేశాలలో భారత్‌తోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News