Sunday, May 19, 2024

ఈవిఎంల భద్రత పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలోని ఈవియం గోడౌన్ లో రానున్న ఎన్నికల కొరకు నిర్వహిస్తున్న ఈవియం ఎఫ్‌ఎల్‌సి, ఈవియంలను భద్రపరచడాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో చేపడుతున్న మొదటి స్థాయి ఈవీఎంల తనిఖీని, ఈవియంల గోడౌన్‌లోకి ప్రవేశించడం మొదలు కొని ఈవియం బ్యాలెట్ యూనిట్ (బియు), కంట్రోలింగ్ యూనిట్ (సియు), వివిపాట్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రక్రియ, ఈవియంలను భద్రపరిచే గదిని, సమస్యలు తలెత్తిన వాటిని వేరుగా భద్రపరచడం, భద్రత సిబ్బంది, బ్యారికేటింగ్ తదితరాలను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ప్రతి ఇవిఎం ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఏ దశలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆయన తెలిపారు.

ఈవీఎంల నోడల్ అధికారి తనిఖీ : జిల్లాలో ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియను పరిశీలనకై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారి (డిప్యూటీ సిఇఓ) ఏ. వెంకటేశ్వరరావు సోమవారం జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలోని ఈవీఎంగోడౌన్ సందర్శించి, మొదటి స్థాయి ఈవీఎంల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. చేపడుతున్న తనిఖీ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఏసీపీ వై. వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, రాంబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News