Sunday, May 5, 2024

ఆశిష్ ‘సెల్ఫిష్’ షురూ

- Advertisement -
- Advertisement -

Selfish movie shooting start

రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘సెల్ఫిష్’ టైటిల్‌తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా…దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “మా ఆశిష్ ‘రౌడీ బాయ్’ చిత్రంతో మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన నమ్మకంతో ఇప్పుడు రెండో సినిమా ప్రారంభించాడు. సుకుమార్, నేను ఆర్య సినిమాకు పనిచేశాం. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మళ్లీ ఇన్నేళ్లకు మేము కలిసి సెల్ఫిష్ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ః మణికందన్.ఎస్, సంగీతం ః మిక్కీ జే మేయర్, ఆర్ట్ ః ఎల్లయ్య.ఎస్, సాహిత్యం ః చంద్రబోస్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News