Tuesday, May 14, 2024

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన సీనియర్ నటి.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక, సినీ సెలబ్రెటీలు కొంతమంది తమకు ఇష్టమైన వంటలను స్వయంగా వండుకోవడం, మరికింతమంది టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో పడ్డారు.తాజాగా తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలతో బాగా పాపులర్ అయిన న‌టి ప్ర‌గ‌తి కూడా తనలో దాగున్న మరో కోణాన్ని చూపించింది. తమిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన ‘మాస్ట‌ర్’ సినిమాలోని ఓ పాటకి డ్యాన్స్ చేసింది. ఈ వయస్సులో కూడా ఆమె ఓ యంగ్ హీరోయిన్ మాదిరి మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది. అనంతరం సోషల్ మీడియాలో ప్రగతి పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమె చేసిన డ్యాన్స్ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Senior Actress Pragathi Super Dance Video Goes Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News