Tuesday, April 30, 2024

లాభాల స్వీకరణకే మొగ్గు

- Advertisement -
- Advertisement -

78 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం బ్యాంకింగ్ ఐటి, మిడ్‌క్యాప్ స్టాక్‌లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్‌లో నష్టాలు కనిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 78 పాయింట్లు పెరిగి 65,945 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 9.85 పాయింట్ల స్వల్ప పతనంతో 19,664 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఎంసిజి స్టాక్స్‌లో అత్యధిక పెరుగుదల కనిపించింది.

ఇది కాకుండా ఆటో, మెటల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కమోడిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్, ఐటి, పిఎస్‌యు బ్యాంకులు, ఫార్మా, మీడియా, ప్రైవేట్ బ్యాంకులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగానికి చెందిన స్టాక్‌లు క్షీణించాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో క్షీణత కనిపించగా, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో గొప్ప పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 15 లాభాల్లో, 15 నష్టాలతో ముగిశాయి.

మార్కెట్ పతనమైనప్పటికీ ఇన్వెస్టర్ల సంపదలో పెరుగుదల కనిపించింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.318.28 లక్షల కోట్లకు చేరగా, గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.317.99 లక్షల కోట్ల వద్ద ముగిసింది. సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.29,000 కోట్లు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News