Friday, May 3, 2024

డిసెంబర్ నాటికి సీరం కరోనా వ్యాక్సిన్ సిద్ధం..

- Advertisement -
- Advertisement -

Serum corona vaccine ready by this December

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నివారించడానికి సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ‘కొవిషీల్డ్ ’వ్యాక్సిన్ 300 నుంచి 400 మిలియన్ డోసుల ఉత్పత్తితో డిసెంబర్ నాటికి రెడీ కాబోతుంది. నాలుగైదు నెలల్లో ప్రజలకు ఇది అందుబాటు లోకి రానుండడం చెప్పుకోతగ్గవిశేషం. అదే జరిగితే ఈ వ్యాక్సినే వైద్యరంగానికి మొదటి వ్యాక్సిన్ కావచ్చు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలు చూపిస్తున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ఆడార్ పూనావాలా ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తమ సంస్థ వ్యాక్సిన్ విశేషాలను వివరించారు. భారత్‌తోపాటు బ్రిటన్‌లో తమ వ్యాక్సిన్ క్లినికల్‌ట్రయల్స్ విజయవంతమైతే ఇదే మొదటి వ్యాక్సిన్ అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. 2021 మొదటి నెలల్లోనే భారతీయులకు భారీ ఎత్తున ఇది అందుబాటు లోకి రాగలదన్నారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు రూ.1000. ఒక డోసులో పది వయల్స్ ఉంటాయి.

ప్రపంచంలోనే భారీ వ్యాక్సిన్ ఉత్పత్తిసంస్థ అయిన సీరం వ్యాక్సిన్ సిద్ధమైతే ఆక్స్‌ఫర్డ్, దాని భాగస్వామ్య సంస్థ ఆస్ట్రాజెనెకా కూడా ఈ వ్యాక్సిన్ తయారు చేయనున్నాయి. ట్రయల్స్ ఆశాజనకమైన ఫలితాలు చూపించాయని పూనావాలా చెప్పారు. ్ల లైసెన్సు ద్వారా ట్రయల్స్ నిర్వహించడానికి భారత నియంత్రిత సంస్థకు వారం రోజుల్లో అనుమతి కోరనున్నామని, అనుమతి మంజూరైతే భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇంతేకాదు భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ఆక్స్‌ఫర్డ్ నిర్వహిస్తోందని తెలిపారు. సార్స్ కొవిడ్ 2 వైరస్ బాధితుల పైన ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించగా ఆ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి తగినంతగా ఏర్పడిందని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో తెలియచేయడం ఈ సందర్భంగా గమనార్హం.

Serum corona vaccine ready by this December

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News