Wednesday, May 1, 2024

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం హర్షనీయం: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటి నుండి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు ఉదయం అల్ఫాహారం అందించడంపై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ పథకం అమలులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాటికి అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న మధ్యాహ్న భోజనంకు ఒక్కోక విద్యార్ధికి కేవలం రోజుకి విద్యారికి రూ 8 చొప్పున చెల్లిస్తున్న నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. కానీ అల్పాహారం మెనూలో ఉన్న అల్ఫహారం ఇవ్వాలంటే మధ్యాహ్న భోజనంకు ఇస్తున్న నిధులు కంటే ఎక్కువ ఇవ్వాలని వాటిని ఎలా ఇస్తారో, ఎన్ని నిధులు ఇస్తారో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.

అదేవిధంగా ఉదయం పాఠశాల ప్రారంభానికి అరగంట ముందు అందిస్తామని చెబుతున్నా దీంతో దూర ప్రాంతాల నుండి బస్సులలో , ఆటోలలో, సైకిళ్ల పై వచ్చే విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవటం కష్టమని, ప్రభుత్వం అరగంట ముందుగానే అందిస్తే దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులందరికి అనుకూలమైన సమయానికి అందించాలని, చాలా విద్యా సంస్థలలో వంట గదులు లేవు, అందరూ విద్యార్థులు కలిసి ఒకే చోట సహాభక్తి భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా ఈ పథకం అక్షయ పాత్ర ,ఇస్కాన్ లాంటి సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి ఇస్త్తే నాణ్యమైన అల్పాహారం అందించకుండా, నాసిరకంగా అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వవద్దని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News