Saturday, July 27, 2024

జెఇఇ మెయిన్ తుది కీ విడుదల

- Advertisement -
- Advertisement -

జెఇఇ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల తుది కీ విడుదలైంది. ఈ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జెఇఇ మెయిన్ ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అంతకన్నా ముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోర్ కార్డును పొందొచ్చు. ఈనెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జెఇఇ మెయిన్ సెషన్-2 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ఎన్‌టిఎ మెరిట్ జాబితాను విడుదల చేయనుంది.

జెఇఇ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈనెల 27 నుంచి మే 7వ తేదీ వరకు జెఇఇ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 17 నుంచి 26వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 26న ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు పేపర్ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్- 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 9న ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News