Wednesday, May 8, 2024

ఏప్రిల్ 1న ‘సేవాదాస్’

- Advertisement -
- Advertisement -

Sevadas movie

 

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్, రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా, -రేఖా నిరోష హీరో హీరోయిన్లు. బంజారా-, తెలుగు-, ఇంగ్లీష్-, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్, భానుచందర్, కె.పి.ఎన్. చౌహాన్, వినోద్ రైనా- సీతారామ్ నాయక్, బాలు ఎమ్.చౌహాన్ పాల్గొన్నారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవాదాస్‘ చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్, భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ‘సేవాదాస్‘ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు అభినందించారు. ‘సేవాదాస్‘ సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News