Sunday, April 28, 2024

జనవరిలో పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి…

- Advertisement -
- Advertisement -
Several special trains will be available in January
దక్షిణమధ్య రైల్వే అధికారుల వెల్లడి

హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు..

07067-, 07068 మచిలీపట్నం- టు కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
07455 నర్సాపూర్- టు సికింద్రాబాద్ (2, 9, 16, 23, 30 తేదీల్లో)
07456 సికింద్రాబాద్ టు -విజయవాడ (3,10,17, 24, 31 తేదీల్లో)
07577 మచిలీపట్నం టు -సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30 తేదీల్లో)
07578 సికింద్రాబాద్- టు మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30 తేదీల్లో)
07605 తిరుపతి టు -అకోలా (7, 14, 21, 28 తేదీల్లో) 07606 అకోలా టు -తిరుపతి (9, 16, 23, 30 తేదీల్లో) ప్రత్యేక రైళ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News