Monday, May 6, 2024

నవ్వించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Shadi Mubarakh movie Pre release Event

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి శుక్రవారం ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్’. వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో వీర్ సాగర్ మాట్లాడుతూ.. “నిర్మాత దిల్‌రాజుకు ఈ సినిమా నచ్చి విడుదల చేస్తున్నారు. సినిమా కథ విషయానికి వస్తే… ఒక ఎన్నారై యువకుడు పెళ్లి చూపుల కోసం ఇండియా వస్తాడు. ఇక్కడ మ్యారేజ్ బ్యూరోకి చెందిన ఓ అమ్మాయిని కలుస్తాడు. వారి ప్రయాణంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా. ఈ సినిమాలోని పాత్రలను మనం ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకులను నవ్వించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది” అని అన్నారు.

Shadi Mubarakh movie Pre release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News