Friday, April 26, 2024

త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా: సిఎస్ సోమేష్‌కుమార్

- Advertisement -
- Advertisement -

త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా
కష్టపడి పనిచేయండి..సంస్థకు పేరు తీసుకురండి
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులను అభినందించిన సిఎస్ సోమేష్‌కుమార్
ఈనెల రెండో శనివారం, ఆదివారాల్లో కూడా పనిచేస్తాం: రిజిస్ట్రేషన్, స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు

మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యేలా రెండు నెలలుగా మంచి సేవలందిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లతో గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బిఆర్‌కెఆర్ భవన్‌లో కలిశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అన్ని స్థాయిల్లో అతి తక్కువ సమయంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్ధేశించి సిఎస్ మాట్లాడుతూ త్వరలో పెండింగ్‌లో ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. డిఆర్‌లకు కూడా పోస్టింగ్‌లను ఇస్తానని, శిథిలావస్థలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తానని అసోసియేషన్ సభ్యులకు ఆయన హామినిచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాఖకు మంచిపేరు తీసుకురావాలని ఆయన వారికి సూచించారు.

రిజిస్ట్రేషన్‌లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి నెలాఖరులోగా 2021, అన్ని ఆదివారాలు, రెండో శనివారం పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పేర్కొన్నారు. తదనుగుణంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అన్ని అదివారాలు (మార్చి 7th, 14th, 21st , 28th), రెండో శనివారం (మార్చి 13th)లలో కూడా పనిచేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తెరిచి ఉంచాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మార్చినెలలో మహాశివరాత్రి (మార్చి 11th ), హోళి(మార్చి 29th) రోజుల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో తెరిచి ఉంటాయని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియో గించుకోవాలని ఆ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమిషనర్, ఐజి శేషాద్రి , అసోసియేషన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, కన్వీనర్, టిఎన్జీఓ హైదరాబాద్ నగర అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్, నరేష్ గౌడ్‌లు పాల్గొన్నారు.

CS Somesh Kumar to met Registration and Stamps office bearers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News