Friday, May 3, 2024

షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటీవ్..

- Advertisement -
- Advertisement -

Shahid Afridi

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆఫ్రిది తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. గత గురువారం నుంచి తాను అనారోగ్యంగా ఉన్నానని, దీంతో టెస్టు చేయించుకున్నానని.. దురదృష్టవశాత్తు కరోనా పాజిటీవ్ వచ్చిందని 40 ఏళ్ల ఆఫ్రిది ట్వీట్టర్‌ ద్వారా తెలిపాడు. కరోనా నుంచి తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయమని ఆఫ్రిది తన అభిమానులను కోరాడు. కాగా, కరోనా వైరస్ బారిన పడిన రెండో పాకిస్థాన్ క్రికెటర్ ఆఫ్రిది. ఇటీవల పాకిస్థాన మాజీ ఓపెనర్ తాఫీఖ్ ఉమర్ ను కూడా కరోనా సోకింది. అయితే ఈ వైరస్ నుంచి ఉమర్ తర్వగానే కోలుకున్నాడు.

Shahid Afridi tests positive for Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News