Tuesday, May 7, 2024

చరిత్ర సృష్టించిన షకిబ్

- Advertisement -
- Advertisement -

Shakib Al Hasan becomes highest wicket-taker in T20

మస్కట్: బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ ట్వంటీ20 క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టి20లలో అత్యధికి వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా షకిబ్ నిలిచాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకిబ్ ఈ ఘనతను అందుకున్నాడు. స్కాట్లాండ్‌పై రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా షకిబ్ తన టి20 వికెట్ల సంఖ్యను 108కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉన్న 107 వికెట్ల రికార్డును తిరగరాశాడు. మలింగ 84 మ్యాచుల్లో 107 వికెట్లు పడగొట్టాడు. షకిబ్ 89 మ్యాచుల్లో 108 వికెట్లను పడగొట్టడం ద్వారా కొత్త రికార్డును తన పేరిట లిఖించుక్నుడు. అంతేగాక అంతర్జాతీయ టి20ల్లో వెయ్యి పరుగులు, వందకుపైగా వికెట్లను పడగొట్టిన మొదటి క్రికెటర్‌గా కూడా షకిబ్ నిలిచాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News