Friday, April 26, 2024

నటి తునీషా జీవితంలో నటుడు ఖాన్ విలన్

- Advertisement -
- Advertisement -

వసాయ్ (మహారాష్ట్ర) : టీవీ నటి తునీషా శర్మ సహనటుడు షీజాన్ ఖాన్‌తో ప్రేమవైఫల్యంతో ప్రేమ విఫలం అయి, మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ నటి ఆత్మహత్యకు ఖాన్ ప్రేరేపించాడని కేసు దాఖలు అయింది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఓ వైపు షీజాన్‌తో ప్రేమ విఫలం కావడం, మరో వైపు ఆయనతోనే ఓ టీవీ షోలో నటించాల్సి రావడం వల్ల ఆమె టెన్షన్‌కు గురయిందని, ఈ దశలోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఖాన్‌ను మరో రెండు రోజుల పాటు తమ కస్టడీలోనే ఉండేలా అనుమతించాలని కూడా వసాయ్ న్యాయస్థానంలో పోలీసులు తెలియచేసుకున్నారు. దీనిపై ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఆమె చాలా సున్నిత మనస్కురాలు, తరచూ ఆందోళనకు గురవుతూ ఉండేది.

లేని పోని విషయాలను ఊహించుకుని బాధపడేది. పైగా ఆమెకు తరచూ భ్రమల్లో ఉండే ఒసిడి లక్షణం కూడా ఉంది. ఈ పలు కారణాలు నిజజీవితంలో సహనటుడితో ప్రేమ చెదిరిపోవడం, నటజీవితంలో ఆయనతోనే ప్రేమ నటిస్తూ పాత్రను పోషించాల్సి రావడం వంటి వాటి మధ్య తీవ్ర ఉద్విగ్నతకు గురి అయి ఉంటుందని న్యాయమూర్తికి పోలీసులు తెలిపారు. ఖాన్‌తో సన్నిహితపు క్షణాలను మర్చిపోలేని స్థితి, ఇదే దశలో నటించాల్సి రావడం వంటివి నిరాశానిస్పృహలకు దారితీసి ఉంటాయని విశ్లేషించారు. ఈ నెల 24వ తేదీన తునీషా మహారాష్ట్రలోని పల్గార్ జిల్లాలోని వసాయ్ వద్ద టీవీ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరుసటి రోజు సహనటుడు ఖాన్‌ను అరెస్టు చేశారు. ఓ వైపు ఈ నటుడు ఇతర అమ్మాయిలతో చనువుగా ఉంటూనే, ఈ నటికి తానే కావల్సిన వ్యక్తిగా చిత్రీకరించుకున్నాడని, ఈ పరిణామాలను సున్నితమనస్కురాలు అయిన తునీషా తట్టుకోలేకపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ విధంగా ఈ నటి విషాదాంతానికి ఆయనే కారణం అని నిర్థారణ అవుతోందని, ఈ కోణంలో మరింతగా దర్యాప్తునకు తమకు సమయం కావాలని కస్టడీని పెంచాలని పోలీసులు కోరారు. ఈ యువనటి విషాదాంతం ఇప్పుడు సమాజంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. పలు విధాలుగా జనం దీనిపై విశ్లేషించుకుంటున్నారు. ప్రేమ సంబంధిత నటన, నిజజీవితంలో దీని వల్ల తలెత్తే పర్యవసనాలు , బలహీన మనస్కులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? ప్రత్యేకించి ఇటువంటి పరిస్థితుల్లో నేటి యువత ఏ విధంగా బలి అవుతోందనేది తీవ్రమైన అంశం అని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు తునీషా ఈ నటుడితో మాట్లాడిందని కూడా నిర్థారణ అయిందని, దీనిని తాము కోర్టుకు ముందే తెలియచేశామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇరువురి మధ్య మాటమాట పెరిగిందని, ఈ దశలో ఆయన ఆమెను దురుసుగా కసురుకుని ఉంటాడని , అసందర్భపు మాటలకు దిగి ఉంటాడని దీనితోనే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. పైగా నిందితుడి మేకప్ గదిలోనే ఈ నటి ఆత్మహత్యకు పాల్పడటం, అక్కడనే తన సెల్‌ఫోన్ వదిలివెళ్లడం ఇవన్నీ ఆ సహనటుడు ఈ ఆత్మహత్యలో పోషించిన పాత్రను తెలియచేస్తున్నాయని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News