Wednesday, May 15, 2024

మనసులు కలిశాయా లేదా అన్నదే ముఖ్యం

- Advertisement -
- Advertisement -

 Shoaib Malik Comments on marriage with Sania

 

ఎక్కడి వారనేది పట్టించుకోకూడదు
సానియాతో వివాహంపై పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్

హైదరాబాద్ : అభిమానులనుంచి ఎంతో వ్యతిరేకత, ఎన్నో వివాదాల మధ్య భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2008లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించాడు. అయితే భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఏ గొడవ జరిగినా, క్రికెట్ మ్యాచ్ జరిగినా నెటిజన్లు ఈ జంటను టార్గెట్ చేయడం నెటిజన్లకు సాధారణంగా మారింది. అయితే తమ పెళ్లై ఏళ్లు గడుస్తున్నప్పటికీ, సానియాను ను పెళ్లి చేసుకోవడంపై వస్తున్న వార్తలపై మాలిక్ తాజాగా స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు.. వారు ఎక్కడినుంచి వచ్చారు.

ఏ దేశం, రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి లాంటి విషయాలను పట్టించుకోకూడదు. పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు. ఒకరికొకరు నచ్చామా? అర్థం చేసుకున్నామా? ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా? అనే విషయాలను మాత్రమే ఆలోచించాలి. భారత్‌లో నాకు చాలామంది మంచి మిత్రులున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్థితుల గురించి ఆందోళన కాని, బాధ కానీ పడటం లేదు. ఎందుకంటే నేను క్రికెటర్‌ను, రాజకీయ నాయకుడ్ని కాదు’ అని మాలిక్ అన్నాడు.

కాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా మాలిక్ పాకిస్థాన్‌లో ఉండిపోగా సానియా, ఇజ్జాన్‌లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో దాదాపు అయిదు నెలలుగా మాలిక్ భార్యా బిడ్డలకు దూరమైనాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ మాలిక్‌ను ఎంపిక చేసింది. దీంతో మళ్లీ కుటుంబాన్ని కలుసుకోలేమోనని బాధపడిన మాలిక్ పిసిబికి ఓ విజ్ఞప్తి చేశాడు. జట్టుతో ఆలస్యంగా చేరతానని, కొన్ని రోజులు కటుంబంతో గడిపి వస్తానని అభ్యర్థించాడు. దానికి పిసిబి కూడా అంగీకరించింది. దీంతో మాలిక్ ఎట్టకేలకు తన భార్య, కుమారుడిని కలుసుకోనున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News