Friday, May 10, 2024

శ్రీరామ్ గోల్డెన్ జూబ్లీ ప్లాన్.. రూ. 2.93 కోట్లు సంపాదించవచ్చు

- Advertisement -
- Advertisement -

ముంబై: శ్రీరామ్ గ్రూప్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బీమా పాలసీని ప్రారంభించింది. ఈ ప్లాన్ ఒక యూనిట్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇది పాలసీ హోల్డర్‌లు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుంది. అదే సమయంలో లైఫ్ కవర్‌ను అందిస్తోంది. పాలసీ రెండు ఎంపికలను అందిస్తుంది – లైఫ్ గోల్ (నిర్దిష్ట కాలానికి కవర్‌ని అందించడం) మరియు లెగసీ (100 ఏళ్ల వరకు కవర్‌ని అందిస్తోంది). కొత్త ప్లాన్ బహుళ ఫండ్ ఎంపికలు మరియు పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. లైఫ్ గోల్ ఎంపిక పాలసీ సమయంలో నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను సాధించాలని చూస్తున్న పాలసీదారుల కోసం రూపొందించబడింది.

లెగసీ ఎంపిక కస్టమర్‌లు వారి జీవితాంతం పెట్టుబడి పెట్టడానికి మరియు వారి ప్రియమైన వారి కోసం గణనీయమైన సంపదను అందించడానికి అనువైనదిగా రూపొందించ బడింది. ఉదాహరణకు, ప్లాన్ యొక్క లైఫ్ గోల్ ఆప్షన్‌లో, పాలసీ ప్రారంభంలో 35 ఏళ్ల వయస్సు ఉన్న పాలసీదారుడు, 30 ఏళ్ల వరకూ ఉన్న పాలసీ వ్యవధి కి ఏటా రూ. 3 లక్షలు చెల్లిస్తే, ఈ 30 ఏళ్లకు అతను/ఆమె పొందే పెట్టుబడి పై రాబడి సంవత్సరానికి 8% ఇస్తే వారు రూ. 2,93,37,365 ఫండ్ విలువ పొందే అవకాశం లేదా పెట్టుబడి పై రాబడి సంవత్సరానికి 4% ఉంటే ఉంది.అప్పుడు వారు రూ. 1,44,99,694 పొందే అవకాశం ఉంది.

లెగసీ ఆప్షన్‌లో, ఉదాహరణకు, పాలసీ ప్రారంభంలో పాలసీదారుకు 35 ఏళ్లు ఉంటే, పాలసీ వ్యవధి 65 ఏళ్లుగా ఉన్న 65 ఏళ్లకు ఏటా రూ. 3 లక్షలు చెల్లిస్తే, మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పై రాబడి సంవత్సరానికి 8% ఉంటే వారు రూ. 39, 72,88,199 ఫండ్ విలువను ఆర్జించే అవకాశం ఉంది. లేదా పెట్టుబడి రాబడి సంవత్సరానికి 4% ఉంటే అప్పుడు వారు రూ. 6,64,22,907. పొందే అవకాశం ఉంది. ఈ క్రొత్త ప్రొడక్ట్ గురించి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సిఇఒ కాస్పరస్ క్రోమ్‌హౌట్ మాట్లాడుతూ.. ప్లాన్ ఎంచుకోవడానికి వివిధ ఫ్లెక్సిబిలిటీలు మరియు ఆప్షన్‌లతో పాటు ఆర్థిక రక్షణ, మార్కెట్‌లో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News