Wednesday, May 1, 2024

సీనియర్ స్టార్‌కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

Shruti Hassan will co-star with Balakrishna

 

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో భారీ యాక్షన్ మూవీ ‘అఖండ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకే బాలయ్య, – బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొడతారని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తర్వాత బాలయ్య తదుపరి సినిమా గురించి సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఈ ఏడాది ‘క్రాక్’ మూవీతో భారీ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో కమర్షియల్ సినిమాగా దీన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడు గోపిచంద్ మలినేని మంచి మాస్ అంశాలతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా పల్నాటి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని టాక్.

బాలయ్య ‘అఖండ’ మూవీ పూర్తి అయిపోగానే గోపి సినిమా పట్టాలెక్కుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పేరు విపరీతంగా వినిపిస్త్తోంది. పరిస్థితి చూస్తుంటే బాలయ్య సినిమాలో శృతి ఖరారు అయినట్లుగా సమాచారం. డైరెక్టర్ గోపీచంద్‌తో ఇదివరకు శృతిహాసన్.. బలుపు, – క్రాక్ సినిమాలు చేసింది. అవి రెండు కూడా సూపర్ హిట్స్. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గోపీచంద్… శృతిని ఒప్పించాడని టాక్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News