Tuesday, April 30, 2024

అందుకోసమే పిలిచిన రోహిత్…. మైదానం వీడిన గిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఓపెనర్ గిల్ 79 పరుగుల వద్ద అతడికి కండరాలు పట్టేయడంతో ఫిజియోథెరపీ చేసిన అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. రోహిత్ శర్మ వద్దని చెప్పడంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనక్కి వచ్చాడు. గిల్  తరువాత శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేశాడు. గిల్ కండరాలు పట్టేయడంతో మైదానంలో విలవిలలాడాడు. గిల్‌ను మైదానం వీడాలని అశ్విన్‌తో రోహిత్ శర్మ సందేశం పంపించాడు. గిల్ మైదానం వీడినప్పుడు టీమిండియా పటిష్టమైన స్థితిలో ఉంది. గిల్ లాంటి ఆటగాడికి గాయం పెద్దదిగా మారితే ఫైనల్లో ఆడటం కష్టంగా ఉంటుందని రోహిత్ భావించడంతో రిటైర్ట్ హార్ట్ గా రమ్మని కబురు పంపాడు. గిల్ శతకం కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం కావునా ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు అంటున్నారు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి కివీస్ ముందు 398 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో న్యూజిలాండ్ 327 పరుగులు చేయడంతో 70 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News