Sunday, April 28, 2024

సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్… కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి…. ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు: సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పిఎస్ఒగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి 9ఎంఎం తుపాకీతో వచ్చాడు. తన కుటుంబ సభ్యులు భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News