Friday, May 3, 2024

అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం.. సిరాజ్ ఖాతాలో తొలి వికెట్‌

- Advertisement -
- Advertisement -

Siraj who made his international Test debut took first Wicket

 

మెల్‌బోర్న్ : తెలుగుతేజం, స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ బాక్సిండ్‌డే మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్‌కు మొదటి వికెట్ లభించింది. ఆసిస్ బ్యాట్స్‌మెన్ లబుషేన్(48) అర్ధ శతకం వైపు దూసుకుపోతుండగా… సిరాజ్ మంచి డెలివరీతో ఔట్ చేశాడు. దీంతో ఆసిస్ 134 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.  మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు టీ విరామ స‌మ‌యానికి 5 వికెట్లు కోల్పోయి 136 ర‌న్స్ చేసింది.  భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్‌, బుమ్రాలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. హైద‌రాబాదీ స్పీడ్‌స్ట‌ర్ సిరాజ్ ఖాతాలో ఒక వికెట్ ప‌డింది. అరంగేట్రం టెస్టు ఆడుతున్న సిరాజ్‌కు వికెట్ ద‌క్క‌డం విశేషం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News