Saturday, May 4, 2024

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Established toll free number in wake of Strain virus

 

హైదరాబాద్ : ఇప్పటికే కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాలను మరింత వేగం చేశామన్నారు. అయితే డిసెంబరు 9 తర్వాత రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి లేదా యూకే గుండా ప్రయాణించి వచ్చిన వారుంటే స్వచ్చంధంగా 04024651119 నంబర్‌కు లేదా 9154170960కు వాట్సప్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి సుమారు 1,200 మంది బ్రిటన్ నుంచి రాగా వారిలో 926 మందని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో 16 మందికి వైరస్‌ సోకింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News