Thursday, November 7, 2024

ఆక్సిజన్ సిలిండర్ పేలి ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ కోసం అమర్చిన ఆక్సిజన్ సిలిండర్ పేలిపోవడంతో ఆ మహిళతోపాటు ఆమె భర్త, మూడేళ్ల మనవరాలితోసహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. బులంద్‌షహర్‌లోని సికంద్రాబాద్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 45 ఏళ్ల రుక్సానా అనే మహిళతోపాటు ఆమె భర్త రియాజుద్దీన్, వారి ముగ్గురు పిల్లలు, మూడేళ్ల మనవరాలు ఈ ఘటనలో మరణించారు.

ఒకే కుటుంబానికి చెందిన 19 మంది సభ్యులు నివసిస్తున్న రెండు అంతస్తుల భవనం పేలుడు దాటికి కూలిపోయింది. సోమవారం రాత్రి 8.30, 9 గంటల మధ్య సిలిండర్ పేలుడు జరిగినట్లు జిల్లా మెజిస్ట్రే చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. రెండు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయిందని, ఆరుగురు వ్యక్తులు మరణించగా ఇద్దరు, ముగ్గురు గాయపడ్డారని, మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News